NTV Telugu Site icon

Today Gold Price: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

Gold Price Today

Gold Price Today

మగువలకు శుభవార్త. గత రెండు రోజలుగా పెరిగిన బంగారం ధరలు.. నిన్న స్థిరంగా ఉన్నాయి. నేడు భారీగా తగ్గాయి. శుక్రవారం (జూన్ 14) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,900గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,890గా ఉంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో​ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,890గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.66,050 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,040గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.65,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,890గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,900 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.71,890గా ఉంది.

Also Read: ENG vs OMA: చెలరేగిన బట్లర్.. 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ విజయం!

నేడు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.200 తగ్గి.. రూ.90,500గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.90,500 ఉండగా.. ముంబైలో సైతం రూ.90,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.95,000లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.90,400గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ కిలో వెండి ధర రూ.95,000లుగా ఉంది.