Gold Price : ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా ఎగిసి పడుతున్న సంగతి తెలిసిందే. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు ఈ రోజ కాస్త బ్రేక్ పడింది. ఇటీవల కాలంతో పోలిస్తే ఈ రోజు బంగారం ధర అమాంతం పడిపోయింది. ఫిబ్రవరి 15వ తేదీ శనివారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 86,070గా నమోదైంది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర రూ. 1090తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,900 పలికింది. ఇది నిన్నటితో పోల్చుకుంటే రూ.1000తగ్గింది.
Read Also:AP CS Vijayanand: స్వచ్ఛతకే ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది..
ఇక బంగారం ధరలు అతి త్వరలోనే కొత్త మైలురాయి 90 వేల రూపాయలు వద్దకు చేరుకున్నాయి. ఈ నెల రోజుల్లోనే దాదాపు బంగారం ధర 9వేల వరకు పెరిగింది. తొలిసారిగా ఆర్నమెంట్ బంగారం అంటే 22 క్యారెట్ల బంగారం సైతం 80 వేల రూపాయలు దాటేసింది. దీంతో ఆభరణాలు కొనుగోలు చేసేవారు వెనకంజ వేస్తున్నారు. అంటే ఒక తులం బంగారు గొలుసు చేయించుకోవాలి అంటే దాదాపు 90 వేల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 22 క్యారెట్ల బంగారంతో పాటు జీఎస్టీ, మేకింగ్ చార్జీలు ఇందులో అదనంగా ఉంటాయి. ఈ లెక్కన చూస్తే ఒక తులం చైన్ కొనుగోలు చేయాలంటే దాదాపు 90 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక వెండి ధర మాత్రం ఒక కేజీకి రూ.1000పెరిగి రూ. 1,08,000వద్ద ట్రేడ్ అవుతుంది.
Read Also:Suriya : సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరేంటే.?