NTV Telugu Site icon

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gold Pricee

Gold Pricee

Gold and Silver Rates on 2023 December 21st in Hyderabad: దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత కొన్ని నెలలుగా పసిడి ధరలు పెరగడమే తప్ప.. ఏ మాత్రం తగ్గడం లేదు. దాంతో 24 క్యారెట్ల తులం బంగారం రికార్డు స్థాయిలో రూ. 63 వేలను తాకింది. నిన్న స్థిరంగా ఉన్న బంగార ధరలు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (డిసెంబర్ 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,000గా ఉంది.  నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 350 పెరగ్గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 380 పెరిగింది.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం… ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,900లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,350లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,650గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,000గా కొనసాగుతోంది.

Also Read: Christmas Celebrations: బెజవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు.. ముఖ్యఅతిధిగా సీఎం జగన్‌

మరోవైపు వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండిపై రూ. 1000 పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 78,500లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 78,500గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,200 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో మాత్రం 76, 200గా ఉంది.