NTV Telugu Site icon

Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

Gold Price Today

Gold Price Today

Gold Price Today in Hyderabad on 2024 January 28: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. శనివారం పెరిగిన పసిడి ధరలు.. నేడు (జనవరి 28) స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,950గా ఉండగా… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే.. పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆదివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,100గా ఉంది. ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ. 57,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 58,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,710గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950గా ట్రేడ్‌ అవుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950లకు లభిస్తోంది.

Also Read: Parliament Entry : పార్లమెంట్లోకి ఎవరు వెళ్లాలన్నా ఇకనుంచి స్కాన్ చేయాల్సిందే

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ఆదివారం కిలో వెండి ధర రూ. 76,000గా పలుకుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,000 కాగా.. చెన్నైలో రూ. 77,500గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,000లుగా ఉండగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ. 73,500గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలతో కిలో వెండి ధర రూ. 77,500గా ఉంది.