NTV Telugu Site icon

Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

Gold Price Lady

Gold Price Lady

Gold Rate Today in Hyderabad on 24th April 2024: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు ఆల్‌టైం హైకి చేరిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా రూ. 75 వేల మార్క్‌కి చేరుకుంది. దీంతో కొనుగోలుదారులు పసిడి షాపుల వైవు చూడాలంటేనే భయపడిపోయారు. అయితే పెరుగుతూ పోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పట్టాయని సంతోషించే లోపే పసిడి రేట్స్ మళ్లీ షాక్ ఇచ్చాయి. మంగళవారం తులం బంగారంపై ఏకంగా రూ.1,400 తగ్గగా.. బుధవారం (ఏప్రిల్ 24) రూ.450 పెరిగింది. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ. 66,600గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,650 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,800 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650 వద్ద కొనసాగుతోంది.

Also Read: LSG vs CSK: ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా మార్కస్‌ స్టొయినిస్‌!

మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం కిలో వెండిపై రూ.100 తగ్గింది. నేడు బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.82,900గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 82,900గా ఉంది. చెన్నైలో రూ.86,400 వద్ద వెండి ధర కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ.82,500గా ఉండగా.. హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో రూ.86,400 వద్ద కొనసాగుతోంది.