Today Gold and Silver Price in Hyderabad: ఇటీవలి కాలంలో బంగారం ధరలు దడ పుట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (మార్చి 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,610గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.66,120గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.10.. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగింది. దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండడంతో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు తెలిసింది.
ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,760
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,270
ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,610
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,120
చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,360
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940
బెంగళూరు, కోల్‌కతా, కేరళ:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,610
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,120
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,610
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,120
Also Read: Paytm : థర్డ్ పార్టీ యూపీఏ ఉపయోగించేందుకు ఆమోదం పొందిన పేటీఎం
మరోవైపు నేడు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.100 పెరిగి.. రూ.77,100లుగా ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,100గా ఉంది. ముంబైలో రూ.77,100 ఉండగా.. చెన్నైలో రూ.80,100గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,100లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,400గా ఉంది.