Gold Price Today in Hyderabad on 24 July 2024: బంగారం కొనుగోలు దారులకు ‘గోల్డెన్’ న్యూస్. గత ఆరు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. నేడు ఊహించని రీతిలో తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2750 తగ్గింది. దాంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,950గా నమోదైంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ. 2990 పతనమై.. రూ.70,860కి దిగొచ్చింది. ఒక్కరోజులోనే పసిడి ధరలు ఇంతలా పతనమవడానికి కారణం కేంద్ర బడ్జెట్.
బంగారం, వెండి వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్ 2024లో తెలిపారు. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇటీవలి కాలంలో ఒక్కరోజులో ఇంత మొత్తం ఎప్పుడూ పడిపోలేదు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు నేడు స్థిరంగానే ఉన్నా.. సుంకం తగ్గడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. గత 6 రోజుల్లో తులం బంగారం ధర రూ.3,800 పతనమైంది. 22 క్యారెట్స్ పసిడి ధరపై 150, 450, 350, 0, 100, 2750 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై వరుసగా 160, 490, 380, 0, 120, 2990 తగ్గింది. అంటే ఈ 6 రోజుల్లో రూ. 4,140 తగ్గింది.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులో రూ. 2750 తగ్గి.. తులం రూ.64,950కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2990 తగ్గి.. రూ.70,860గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 2750 తగ్గి.. రూ. 65,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల ధర రూ.71,010 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,950గా.. 24 క్యారెట్ల ధర రూ.70,860గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర 64,950గా.. 24 క్యారెట్ల ధర రూ.70,860గా ఉంది.
Also Read: KTR Birthday: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే విషెస్!
మరోవైపు వెండి ధరలు ఇటీవలి రోజుల్లో పడిపోతూనే ఉన్నాయి. దానికి తోడు సుంకం కూడా తగ్గడంతో కిలో వెండిపై రూ.4000 పడిపోయింది. నేడు కిలో వెండిపై రూ.500 తగ్గి.. 87,500గా నమోదైంది. హైదరాబాద్ నగరంలో నేడు కిలో వెండి రూ.92,000కు చేరింది. విజయవాడ, విశాఖలో కూడా రూ.92,000గా నమోదైంది.