Site icon NTV Telugu

Gold Rate Today: గోల్డ్‌ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

Gold Rates Today In Hyderabad

Gold Rates Today In Hyderabad

Gold Price Today Hyderabad: లవర్స్‌కి షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,200లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,200గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.67,250 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.73,350గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,200గా నమోదైంది.

Also Read: Kolkata Doctor Murder: జూనియర్ డాక్టర్ల సమ్మెలో టీమిండియా మాజీ కెప్టెన్!

మరోవైపు నేడు వెండి ధర స్థిరంగా ఉంది. బుధవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.87,000గా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ87,000లుగా ఉండగా.. చెన్నైలో రూ.92,000లుగా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.82,500గా.. హైదరాబాద్‌లో రూ.92,000లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.92,000ల వద్ద కొనసాగుతోంది.

 

Exit mobile version