NTV Telugu Site icon

Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?

Gold Price Today Hyderabad

Gold Price Today Hyderabad

Gold and Silver Price Today in Hyderabad: దసరా పండగ వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. మంగళవారం (అక్టోబర్ 15) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.200 తగ్గి.. రూ.70,950గా నమోదైంది. మరోవైపు 24 క్యారెట్లపై రూ.220 తగ్గి.. రూ.77,400గా కొనసాగుతోంది.

పండగ వేల పెరిగిన వెండి ధర కాస్త శాంతించింది. వరుసగా రెండు రోజులు స్థిరంగా కొనసాగిన వెండి.. నేడు కాస్త తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.96,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష మూడు వేలుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి 86 వేలుగా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,950
విజయవాడ – రూ.70,950
ఢిల్లీ – రూ.71,100
చెన్నై – రూ.70,950
బెంగళూరు – రూ.70,950
ముంబై – రూ.70,950
కోల్‌కతా – రూ.70,950
కేరళ – రూ.70,950

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,400
విజయవాడ – రూ.77,400
ఢిల్లీ – రూ.77,550
చెన్నై – రూ.77,400
బెంగళూరు – రూ.77,400
ముంబై – రూ.77,400
కోల్‌కతా – రూ.77,400
కేరళ – రూ.77,400

Also Read: IND vs NZ: ఆ ముగ్గురు బెంచ్‌కే పరిమితం.. న్యూజిలాండ్‌తో ఆడే తొలి టెస్టు తుది జట్టిదే!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,03,000
విజయవాడ – రూ.1,03,000
ఢిల్లీ – రూ.97,000
ముంబై – రూ.96,900
చెన్నై – రూ.1,03,000
కోల్‎కతా – రూ.97,000
బెంగళూరు – రూ.86,000
కేరళ – రూ.1,03,000