Gold and and Silver Rates Today 21st July 2023: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. వరుసగా మూడో రోజు పసిడి రేట్లు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జులై 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,750గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,900గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,750గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,100లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,200 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 60,650గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,750 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,750గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,750గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,750 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర శుక్రవారం రూ. 78,400లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై అలంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 78,400గా ఉండగా.. చెన్నైలో రూ. 82,400గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 77,850 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 82,400లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 82,400ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Earthquake in Jaipur: జైపూర్లో భూకంపం.. ఒక్క గంటల్లో మూడుసార్లు కంపించిన భూమి
Also Read: Project K: ‘కల్కి’ గా దిగిన ప్రభాస్… హాలీవుడ్ రేంజ్ లో ఫస్ట్ గ్లింప్స్..
