NTV Telugu Site icon

Gold Price Today: శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే!

Gold Price Today

Gold Price Today

Gold Rate Today on 31 May 2024 in Hyderabad: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. వరుసగా పెరుగుతూపోయిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం (మే 31) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,760గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజటీ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

నేడు హైదరాబాద్​లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,760గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,850గా కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,910గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,760గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,760గా ఉంది.

Also Read: Kalki 2898 AD: ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌.. భారీ మొత్తానికి ‘కల్కి 2898 ఏడీ’ పంపిణీ హక్కులు!

నేడు వెండి ధరలు తగ్గాయి. కిలో వెండిపై రూ.1,000 తగ్గి.. రూ.95,500గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95,500 కాగా.. ముంబైలో రూ.95,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.1,00,000లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.95,600గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.1,00,000లుగా ఉంది.

Show comments