NTV Telugu Site icon

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతకు చేరిందో తెలుసా?

Gold

Gold

Gold Price Hits All-Time Record in India: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధర తగ్గుతుందనుకునే లోపే ఇంకా పైపైకి ఎగబాకుతున్నాయి. మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. జీవన కాల గరిష్టాల్ని నమోదు చేశాయి. బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 200 ఎగబాకగా.. ఏకంగా రూ. 58 వేల మార్కు దాటేసింది. స్వచ్ఛమైన బంగారం ధర 24 క్యారెట్లపై రూ. 260 పెరిగి ప్రస్తుతం రూ. 63,490 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం… ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,350లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,640గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,750లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,090గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,490గా కొనసాగుతోంది.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

బంగారం ధర పెరిగితే. వెండి ధర మాత్రం తగ్గింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండిపై రూ. 500 తగ్గి.. రూ. 79,000లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 79,000గా ఉంది. బెంగళూరులో 77,000గా ఉంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతోంది.

Show comments