NTV Telugu Site icon

Today Gold Rate: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవే!

Akshaya Tritiya 2024 Gold

Akshaya Tritiya 2024 Gold

Gold Rates Raised for the third day in a row: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్. మొన్నటి వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. బుధవారం (మే 29) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి.. రూ. 67,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి.. రూ. 73,200 వద్ద కొనసాగుతోంది. ఈ మూడు రోజుల్లో 22 క్యారెట్లపై వరుసగా రూ. 250, 200, 250 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

హైదరాబాద్​లో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,200గా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,250గా కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,350గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,200గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.67,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,200గా ఉంది.

Also Read: Team India: న్యూయార్క్‌లో భారత్.. టీ20 ప్రపంచకప్‌ 2024 వేట మొదలు!

మరోవైపు వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. కొన్ని నగరాల్లో కిలో వెండి ధర ఏకంగా లక్ష దాటేసింది. కిలో వెండిపై ఈరోజు రూ.1,200 పెరిగి.. రూ.97,700గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97,700 కాగా.. ముంబైలో రూ.97,700గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.1,02,200లుగా నమోదవగా.. అత్యల్పంగా బెంగళూరులో రూ.95,250గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.1,02,200లుగా నమోదైంది.