Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..

Gold Man Surya Bhai

Gold Man Surya Bhai

Hyderabad: గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్ పరారీలో ఉన్నాడు. సూర్య కోసం పోలీసులు వెతుకున్నారు. నిన్న అతడిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఇంటికి ఇచ్చారు. కట్‌చేస్తే.. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు సూర్య భాయ్..

అసలు ఏం జరిగిందంటే..?
మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే బంగారం అందిస్తానని నమ్మబలికిన “గోల్డ్ మ్యాన్” సూర్యా భాయ్ చివరకు తన అసలు రంగు బయటపెట్టాడు. నమ్మి వచ్చిన అమాయక బాధితులకు ఆశ చూపి, ఏకంగా 30 లక్షల రూపాయల మేర భారీ మోసానికి తెరలేపాడు. డబ్బులు చేతికి అందాక, గోల్డ్ ఇవ్వకుండా.. అడిగితే రిటర్న్ ఇవ్వకుండా సతాయిస్తూ, ఏకంగా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి బుకాయించే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ కేటుగాడి మోసాలు ఎక్కువ కాలం సాగలేదు. పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేయడంతో సూర్యా భాయ్ అసలు మోసాల గుట్టు రట్టయింది. విషయం తీవ్రం కావడంతో, అరెస్ట్ భయంతో ఈ గోల్డ్ మ్యాన్ తన ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే పరారయ్యాడు. మొదట అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు, ఘటన తీవ్రత దృష్ట్యా తదుపరి విచారణ కోసం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయబడింది. ప్రస్తుతం నారాయణగూడ పోలీసులు ఈ ఘరానా మోసగాడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుడు షాద్ నగర్ వైపు వెళ్లినట్టు పోలీసులకు బలంగా అనుమానాలు ఉండటంతో, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. త్వరలోనే ఈ సూర్యా భాయ్‌ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెడతామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.