గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గితే.. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.350 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (మే 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400గా.. 24 క్యారెట్ల ధర రూ.97,530గా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.97,530గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,400గా ఉంది. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,530గా.. 22 క్యారెట్ల ధర రూ.89,400గా నమోదైంది. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,680గా.. 22 క్యారెట్ల ధర రూ.89,550గా కొనసాగుతోంది.
Also Read: Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 వాయిదా.. స్పందించిన చిత్రబృందం!
మరోవైపు వరుసగా రెండు రోజులు పెరిగిన వెండి ధర కూడా నేడు తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1,000 తగ్గి.. రూ.1,00,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ.1,11,000గా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి లక్షగా కొనసాగుతోంది. నేడు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.
