సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే తులం బంగారంపై రూ. 5,950 తగ్గింది. శుభకార్యాల వేళ పసిడి ధరలు ఇంత మొత్తంలో తగ్గుతాయని ఎవరూ ఊహించి ఉండరు. వారం ప్రారంభం మగువలకు తీపికబురును అందించినట్లైంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా నిలుస్తోంది. ధరల తగ్గుదల పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 5,450 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 5,950 తగ్గింది. కిలో వెండి ధర రూ. 20,000 తగ్గింది.
Also Read:NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్
హైదరాబాద్ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 12,835, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 14,002 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,28,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,020 వద్ద అమ్ముడవుతోంది. విశాఖ పట్నం,విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,500 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,170 వద్దకు చేరింది.
బంగారంతో పోటీపడుతూ ధర పెరుగుతున్న వెండి ధరలు కూడా నేడు భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు కిలో వెండి పై రూ. 20,000 తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి రూ.2,30,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో వెండిపై రూ. 15000 తగ్గి రూ. 2,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది.