Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..

Gold Price

Gold Price

గత కొంతకాలంగా ఆకాశాన్ని తాకుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ వచ్చిన పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది. బులియన్ మార్కెట్‌లో చోటుచేసుకున్న తాజా పరిణామాల కారణంగా బంగారం, వెండి రేట్లు భారీగా పతనమయ్యాయి.

ప్రస్తుత మార్కెట్ వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై ఏకంగా రూ.1,700 తగ్గి రూ.1,44,380 వద్దకు చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,550 తగ్గి రూ.1,32,350 వద్దకు చేరుకుంది. పసిడి బాటలోనే పయనించిన వెండి ధరలు కూడా భారీగా క్రాష్ అయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో దాని ధర రూ.2.25 లక్షల మార్కు వద్దకు పడిపోయింది.

ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు..
గత ఆగస్టు నెలలో అంతర్జాతీయ ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్‌ల తీవ్రత, డిమాండ్ పెరుగుదల వల్ల 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆల్-టైమ్ గరిష్ట స్థాయి అయిన దాదాపు రూ.1.63 లక్షల వరకు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు ముగింపు నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న తీవ్ర మార్పులు ఈ సడన్ పతనానికి కారణమయ్యాయి.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంలో మార్పులు, బాండ్ ఈల్డ్స్ హెచ్చుతగ్గులు, డాలర్ బలపడటం వల్ల పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను మళ్లించి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. దీనికి తోడు రాబోయే పండగల సీజన్, వివాహాల సీజన్‌కు ముందు మార్కెట్‌లో చోటుచేసుకున్న ఈ కరెక్షన్ కొనుగోలుదారులకు అనుకూలమైన అవకాశంగా నిలిచింది. త్వరలో రానున్న ధన్‌తేరస్, దీపావళి పండగల వేళ బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం తగ్గిన ఈ ధరలు కొనుగోలుకు సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.