Gold and Silver Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధర భారీగా పెరిగింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలకు తోడు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో జాతీయంగా పసిడికి డిమాండ్ పెరిగిపోయింది.. దీంతో.. ఈ రోజు అమాంతం ధర పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2000 డాలర్ల పైనే ట్రేడ్ అవుతుండగా.. భారత మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఏకంగా రూ.880 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.800 పెరిగింది.. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది.. కిలో వెండి రేటు ఈ రోజు రూ.700పైకి కదిలించింది..
Read Also: PhonePe: ఫోన్‌పే కీలక నిర్ణయం.. ఈ చెల్లింపులకు పిన్ అవసరంలేదు..
ఇక, ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.56,650కు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,790గా ఉంది.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,500గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.61,640కి ఎగిసింది.. ఇక, విజయవాడ, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,500గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,640గా ఉంది. మరోవైపు.. కోల్‍కతా, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పడిసి ధర రూ.61,640 దగ్గర కొనసాగుతోంది.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,060గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,240 దగ్గర ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,550గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,690గా ఉంది.. ఇక, అహ్మదాబాద్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,550గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,690 దగ్గర కొనసాగుతోంది.