పసిడి ప్రియులకు నేటి బంగారం ధరలు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. నిన్న, మొన్న పెరుగుతూ తగ్గుతూ షాకిచ్చిన గోల్డ్ ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. పుత్తడి ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 513, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,720 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Official : మెగాస్టార్ కు జోడిగా లేడి సూపర్ స్టార్..
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,200 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,130 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,350గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,280 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,08,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 97,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
