Site icon NTV Telugu

Gold Price : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Rate Today

Gold Rate Today

Gold Price : ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్‌లో బంగారం, వెండి ధరలు తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న పెరిగిన బంగారం రేట్లు, నేడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈరోజు (డిసెంబర్ 28న) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,840కి చేరుకుంది. ఇది నిన్నటి ధరలతో పోల్చి చూస్తే 160 రూపాయల తగ్గింది. ఇక ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,350కి చేరుకుంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.150తగ్గింది.

Read Also:Chhattisgarh: సమతా పేరిట సంచలన లేఖ విదుదల చేసిన మావోయిస్టులు

మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 7,7840స్థాయికి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.71,350కు చేరుకుంది. ఇక వెండి ధర గురించి మాట్లాడితే కిలో వెండి రూ. 99,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు తగ్గింది. కాబట్టి ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 77,990 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,500 వద్ద ఉంది.

Read Also:Samantha : బేబీ బంప్‎తో సమంత .. వైరల్ అవుతున్న ఫోటోలు

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ISO) ద్వారా హాల్ మార్క్ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ 24కి మించదు, క్యారెట్ ఎక్కువైతే బంగారం స్వచ్ఛంగా ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం 99.9శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది.

Exit mobile version