Site icon NTV Telugu

AP Govt: మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్‌.. ఏపీ ప్రభుత్వం కసరత్తు!

Chandrababu Cm

Chandrababu Cm

పశు సంవర్ధక శాఖలో కీలక మార్పులు చెయ్యడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్‌పై కసరత్తు చెయ్యాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పశు సంవర్ధక శాఖ కాంక్లేవ్‌లో స్టార్టప్ ప్రతినిధులు వివిధ అంశాలను సీఎంకు వివరించారు. బుధవారం ఉదయం విజయవాడలో స్టార్టప్ కంపెనీలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు.

Also Read: AP Liquor Scam: గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు!

మనుషులకు ఆధార్ లాగా పశువులకు గోదార్‌ను తెస్తున్నట్టు స్టార్టప్ కంపెనీలు సీఎం చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇచ్చాయి. దీనిపై ఆసక్తి చూపిన చంద్రబాబు.. తిరుపతి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సూచించారు. తిరుపతి జిల్లాలోని అన్ని పశువులకు గోదార్ అనుసంధానం చేయాలన్నారు. కోళ్లకు వచ్చే వ్యాధులను గుర్తించటం, వాటి ఆరోగ్య విషయాలు తెలుపటంపై ప్రత్యేక యాప్ తీసుకురావాలని సీఎం చంద్రబాబు స్టార్టప్ కంపెనీలకు కోరారు.

Exit mobile version