Godavari Water Level: 39 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.. రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక!
- ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు
- 39 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First Danger Warning Soon at Bhadrachalam: భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం 20 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం.. ఆదివారం ఉదయానికి 39 అడుగులకు చేరుకుంది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం వరద పోటెత్తుతోంది. భద్రాచలం ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రాత్రికి ఇది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి రావచ్చని ఇప్పటికే అధికార యంత్రాంగానికి సీడబ్ల్యుసీ హెచ్చరికలు జారీ చేసింది. నీటిమట్టం 43 అడుగులు దాటితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
కాలేశ్వరం, తుపాకుల గూడెం నుంచి భారీ వరద వస్తుంది. శనివారం ఉదయం తుపాకుల గూడెం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద దిగివకి వదలగా..ఈరోజు అది ఎనిమిది లక్షలకు పైచిలుకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం దిగువన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న శబరి నది 38 అడుగులు మేర ప్రవహిస్తోంది. దాంతో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చింతూరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేసే పరిస్థితి ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలతో కూడా భారీ వరద వచ్చి గోదావరిలో చేరుతోంది. ఇప్పటివరకు పోలవరం ,ధవలేశ్వరం వద్ద వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకి వదులుతున్నారు. దీంతో గోదావరి నుంచి సముద్రం వైపుకి భారీగా వరద తరలివెళ్తుంది.
Also Read
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Vaibhav Sooryavanshi: "ఇది నిరంకుశత్వం".. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
Also Read: Warangal Bhadrakali Temple: శాకంబరీ అలంకరణలో భద్రకాళీ అమ్మవారు.. ఆలయానికి పోటెత్తిన భక్తులు!
నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 19,686గా.. ఔట్‌ఫ్లో 18,227 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 690.875 అడుగులు ఉంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లోకి 385 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1387 అడుగులుగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 4.06 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 85 గేట్లు ఎత్తి వరదను కిందికి వదులుతున్నారు.
తాజావార్తలు
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!