NTV Telugu Site icon

Godavari Floods: కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి..

Kaleshwaram

Kaleshwaram

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దీంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తింది. తీరం వద్ద 12.300 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లను వరద ముంచెత్తింది. జాగ్రత్త పడ్డ అధికారులు భక్తుల పుణ్యస్నానాలను నిలిపివేశారు. మరోవైపు.. వరద ఉధృతిని జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అంతేకాకుండా.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించిన అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

Operation Raavan: సినిమా ప్రారంభమైన గంటలోపు అది కనిపెడితే.. సిల్వర్ కాయిన్!

మరోవైపు.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద పోటెత్తింది. బ్యారేజ్లో మొత్తం 85 గేట్లు ఎత్తి‌ దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్‌ ఫ్లో, ఔట్ ఫ్లో 9,36,890 క్యూసెక్కులు ఉంది. బ్యారేజ్ పూర్తి స్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఇదిలా ఉంటే.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పెద్దపల్లి మాజీ జడ్పీ చైర్ పర్సన్, బీఆర్ఎస్ మంథని ఇంచార్జ్ పుట్ట మధు సందర్శించారు. వరద ఉధృతిని కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యారేజ్లో 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందన్నారు. ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయం చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ పేరును బద్నాం చేసేందుకు గోదావరి జలాలను వదిలేసి.. ప్రజలకు త్రాగు, సాగు నీటిని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.

Lok sabha: నితీష్‌ సర్కార్‌కు కేంద్రం ఝలక్.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని వెల్లడి