NTV Telugu Site icon

Godavari: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. 3 రోజుల పాటు కొనసాగనున్న వరద ప్రవాహం

Godavari

Godavari

Godavari: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాల ప్రకారం మరో మూడు రోజులు వరద ప్రవాహం కొనసాగి ఆతర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. శనివారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద 53.8 అడుగుల నీటి మట్టం ఉందని అలాగే ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.34 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు తెలిపారు. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితిని వివరిస్తూ ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, మండలాల అధికారులకు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. సహాయక చర్యల్లో 3 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు ఎండి రోణంకి కూర్మనాధ్ తెలిపారు.

Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు తక్షణం స్పందించిన పోలీసులు

అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇప్పటివరకు 21,051 మందిని ఖాళీ చేయించినట్లు అలాగే 13,289 మందిని 82 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. 273 మెడికల్ క్యాంప్స్ నిర్వహించినట్లు చెప్పారు. 3,126 ఆహార ప్యాకేట్లు, 2.86 లక్షల వాటర్ ప్యాకేట్లు పంచినట్లు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని 96 మండలాల్లో 525 గ్రామాలు వరద ప్రభావితమైనవని , మరో 230 గ్రామలు వరద ముంపుకు గురైనట్లు తెలిపారు. ప్రస్తుత ప్రాధమిక నివేదికల ప్రకారం అగ్రికల్చర్ 43,234 హెక్టార్లు, హార్టీకల్చర్ 2728.45 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు.

గోదావరి,కృష్ణాతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో నదుల్లో వరద ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలువలు,కల్వర్టులకు మరియు పడిపోయిన విద్యుత్ స్తంబాలకు, లైన్లకు దూరంగా ఉండాలన్నారు. వరద నీటిలో ప్రవేశించి ప్రయాణాలు చేయరాదన్నా