Site icon NTV Telugu

Rabi Season : రబీ సాగు కోసం ధవళేశ్వరం బ్యారేజి నుంచి నీటిని విడుదల..!

Rabi Season

Rabi Season

Rabi Season : గోదావరి జిల్లాలో రబీ సాగు కోసం డెల్టా కాలువలకు డిసెంబర్ 1 నుంచి ధవళేశ్వరం బ్యారేజి నుంచి నీటిని విడుదల చేయనున్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన తూర్పుగోదావరి జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2024- 25 రబీ సీజన్ లో తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాల పరిధిలో 8 లక్షల 96 వేల 507 ఎకరాల ఆయకట్టుకు సాగు, మంచినీటి అవసరాలకు నీటిని అందిస్తారు. తూర్పు డెల్టాకు 2 లక్షల 64 వేల 507 ఎకరాలు, పశ్చిమ డెల్టాకు 4 లక్షల 60 వేలు ఎకరాలు, సెంట్రల్ డెల్టా కోనసీమకు లక్షా 72 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయనున్నారు . ప్రస్తుతం గోదావరి నదిలో 91 పాయింట్ 3,5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. తూర్పు గోదావరి జిల్లా రబీ ఆయకట్టుకు గోదావరి తూర్పు డెల్టా పరిధిలోని కడియం, అనపర్తి, బిక్కవోలు మండలాలకు గోదావరి పశ్చిమ డెల్టా పరిధిలో కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు నీరు అందించాలని నిర్ణయించారు.

Beerla Ilaiah: ఆలేరు ఆసుపత్రిలో డేట్ ముగిసిన ఇంజక్షన్.. వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం..

Exit mobile version