Maa Robot: దివ్యాంగులైన కుమార్తె కోసం దినసరి కూలీ సరికొత్త ఆవిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maa Robot: కలకు కృషి తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని మరోమారు నిరూపించాడు గోవాకు చెందిన దినసరి కూలీ. ఆయన పెద్దగా ఏమీ చదువుకోలేదు. అయితేనేం.. దివ్యాంగురాలైన తన కుమార్తెకు అన్నం తినిపించేందుకు వాయిస్ కమాండ్‌తో ఓ రోబోను తయారు చేసి టెక్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాడు. ఆయన పేరు బిపిన్ కదమ్. గోవాలో దినసరి కూలీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 40 ఏళ్ల వయస్సు గల కదమ్‌కు 14 ఏళ్ల దివ్యాంగురాలైన కూతురు ఉంది. ఆ అమ్మాయి చేతులు కూడా కదిలించలేని స్థితి ఉంది. తినిపించడం మొదలుకుని అన్ని పనులు చూసుకునే తల్లేమో దీర్ఘకాలిక వ్యాధితో మంచానికి పరిమితమైంది. రెండేళ్ల క్రితం ఆమె కూడా మంచం పట్టింది. తన కుమార్తెకు నిత్యం భోజనం కలిపి తినిపించడం సమస్యగా మారింది.
దినసరి కూలీ అయిన బిపిన్ ఉదయం వెళ్తే రాత్రికి ఇంటికి చేరుకునేవాడు. కదమ్ సాయంత్రం పని నుంచి ఇంటికొచ్చాక తినిపిస్తేనే పాపకు భోజనం. భార్య నిస్సహాయత, కూతురి కోసం ఏమీ చేయలేక ఆమె పడుతున్న వేదన ఆయన్ను బాగా ఆలోచింపజేశాయి. ఇలాగైతే లాభం లేదని కుమార్తెకు అన్నం తినిపించేందుకు రోబో ఏమైనా దొరుకుతుందేమోనని మార్కెట్లో వాకబు చేశాడు. అలాంటిదేమీ లేకపోవడంతో ఇక లాభం లేదని, తానే ఆ పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టుకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్
పెద్దగా చదువుకోని బిపిన్ కూలికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికొచ్చాక రోబోను తయారుచేయడం ఎలా అన్నదానిపై నాలుగు నెలలపాటు పరిశోధన చేశాడు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుని, దానిపై అవగాహన పెంచుకున్నాడు. దాని సాయంతో నాలుగు నెలలు కష్టపడి ఓ రోబోను తయారుచేశాడు. ఈ రోబో వాయిస్ కమాండ్‌కు అనుగుణంగా పని చేస్తుంది. పాప కోరిన మేరకు పండ్లు, దాల్ రైస్ వంటివి తినిపిస్తుంది. అమ్మలా ఆకలి తీరుస్తోంది గనుక దీనికి ‘మా రోబో’ అని పేరు పెట్టాడు. రోబో చేతిలో ఉండే పళ్లెంలో ఆహారం పెడితే అది అమ్మాయికి తినిపిస్తుంది. వాయిస్ కమాండ్‌ను వాడుకుంటూ.. ఆహారాన్ని కూరతో లేదా పప్పుతో కలిపి తినాలని భావిస్తోందా అన్నది ఆ అమ్మాయి తెలియజేస్తే .. ఆ రోబో ఆ విధంగానే పనిచేస్తుంది. ఇప్పుడు రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి రాగానే కూతురి నవ్వు ముఖం చూస్తే ఎనలేని శక్తి వస్తోందని చెబుతున్నాడు. ఈ ఆవిష్కరణను గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ప్రశంసించింది. ఈ పరికరాన్ని వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!