Gmailలో సరికొత్త ఫీచర్.. ఇది WhatsAppలా పనిచేస్తుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gmail New Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే Gmail వినియోగదారులకు Google గుడ్ న్యూస్ చెప్పింది. Gmailలో ఇప్పుడు కొత్త భద్రతా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది WhatsApp, Telegram వంటి యాప్‌లలో ఉండే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానాన్ని పోలి ఉంటుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనేది డిజిటల్ భద్రతా విధానం. ఈ సిస్టమ్ ద్వారా పంపిన వ్యక్తి మరియు స్వీకరించే వ్యక్తి తప్ప, మధ్యలో మరెవరూ ఆ సందేశం లేదా ఈమెయిల్‌ను చదవలేరు. అంటే మీ సమాచారం పూర్తిగా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుతుంది. సులభంగా చెప్పాలంటే, మీరు తాళం వేసిన పెట్టెను పంపితే, ఆ తాళం తెరవడానికి కీ స్వీకర్త దగ్గర మాత్రమే ఉంటుంది. ఇదే విధంగా ఈ భద్రతా వ్యవస్థ పనిచేస్తుంది.
మొబైల్‌లోనే సురక్షిత ఈమెయిల్స్
ఈ కొత్త అప్‌డేట్‌తో Android, iOS వినియోగదారులు ఇప్పుడు Gmail మొబైల్ యాప్ నుంచే ఎన్‌క్రిప్ట్ చేసిన ఈమెయిల్స్‌ను రాయడం, పంపడం, చదవడం చేయవచ్చు.. గతంలో దీనికోసం డెస్క్‌టాప్ లేదా థర్డ్ పార్టీ టూల్స్ అవసరం అయ్యేది.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ఎవరికి అందుబాటులో ఉంటుంది?
ఈ సదుపాయం ప్రధానంగా Google Workspace Enterprise వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్ సపోర్ట్ ఉన్న అకౌంట్లలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. ముందుగా అడ్మిన్ కన్సోల్ ద్వారా Android, iOS సపోర్ట్‌ను యాక్టివేట్ చేయాలి.
యూజర్లకు ప్రయోజనాలు..
– సున్నితమైన ఈమెయిల్స్‌కు అదనపు భద్రత
– మొబైల్ నుంచే సురక్షిత మెయిల్స్ పంపే అవకాశం
– ఎటువంటి అదనపు సాఫ్ట్‌వేర్ అవసరం లేదు
– ఎక్కడి నుంచైనా సురక్షిత యాక్సెస్
Google ప్రకటన
ఈ ఫీచర్ Rapid Release మరియు Scheduled Release డొమైన్‌లలో అందుబాటులోకి వచ్చినట్లు Google తెలిపింది. దీంతో వ్యాపార సంస్థలు, ప్రొఫెషనల్ వినియోగదారులు మరింత సురక్షితంగా కమ్యూనికేట్ చేయవచ్చు. మొత్తంగా Gmailలో WhatsApp తరహా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రావడం వినియోగదారులకు పెద్ద ప్రయోజనంగా చెప్పుకోవాలి… ముఖ్యంగా గోప్యమైన సమాచారం పంపే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. భవిష్యత్తులో సాధారణ వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
-
Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!