NTV Telugu Site icon

Global Covid Summit- Modi: సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యత.. డబ్ల్యూహెచ్ఓ రూల్స్ సరళం చేయాలి

Modi

Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ గ్లోబర్ కోవిడ్ సమ్మిట్ లో ప్రసంగించారు. కోవిడ్ నివారణకు భారత్ తీసుకుంటున్న చర్యలను, వ్యాక్సినేషన్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా సాంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బారతదేశ జెనోమిక్స్ కన్సార్టియం ప్రపంచ వైరస్ డేటా బేస్ కు ఉపయోగపడిందని ఆయన అన్నారు. ఈ నెట్ వర్క్ ను పొరుగు దేశాలకు కూడా విస్తరిస్తామని వెల్లడించారు. కోవిడ్ పై మా పోరాటానికి, రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు సాంప్రదాయ జౌషధాలు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

భారత్ లోని కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచంలోనే పెద్దదని.. 90 శాతం మంది పెద్దలకు 5 కోట్ల కన్నా ఎక్కువ మంది పిల్లలకు పూర్తిగా టీకాలు వేశామని.. భారత్ 4 కోవిడ్ వ్యాక్సిన్లను తయారు చేసిందని, వీటన్నింటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని వెల్లడించారు. ఏడాదికి 5 బిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేయగట సామర్థ్యం భారత్ సొంతమని అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నియమాలను మరింగ సరళంగా మార్చాలని ప్రధాని సూచించారు. వ్యాక్సిన్ల ఆమోదం ప్రక్రియను డబ్ల్యూహెచ్ఓ సంస్కరించాలని ప్రధాని కోరారు. ప్రపంచంలోని 98 దేశాలకు భారత్ 200 మిలియన్ డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ను సరఫరా చేశామని మోదీ తెలిపారు. భారత్ శక్తి సామర్థ్యాలను ఇతర దేశాలకు కూడా అందించామని అన్నారు.