Site icon NTV Telugu

Glenn Maxwell Century: వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్!

Glenn Maxwell Century

Glenn Maxwell Century

Glenn Maxwell smashes Fastest ODI World Cup Century: ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ప్రపంచకప్‌ 2023లో భాగంగా బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్ శతకం బాదాడు. మ్యాక్సీ ఇన్నింగ్స్‌లో 8 సిక్సులు, 9 ఫోర్లు ఉండడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్ 106 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికా స్టార్ ఐడెన్ మార్‌క్రమ్‌ రికార్డును గ్లెన్ మ్యాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో శ్రీలంకపై మార్‌క్రమ్‌ 49 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ రికార్డును తాజాగా మ్యాక్స్‌వెల్ బ్రేక్ చేశాడు. 2023 ప్రపంచకప్‌కు ముందు ఈ రికార్డు ఐర్లాండ్ క్రికెటర్ కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉంది. 2011లో ఇంగ్లండ్ జట్టుపై ఓబ్రియన్ 50 బంతుల్లో శతకం చేశాడు. 2015లో మ్యాక్స్‌వెల్ 51 బంతుల్లో, ఏబీ డివిలియర్స్ 52 బంతుల్లో శతకాలు చేశారు. 2023 ప్రపంచకప్‌లోనే అత్యధిక సెంచరీలు నమోదు కావడం విశేషం.

Also Read: Gold Price Today : మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంత ఉందంటే?

వన్డే ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీల లిస్ట్:
గ్లెన్ మాక్స్‌వెల్ 40 బంతుల్లో – ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ – ఢిల్లీ, 2023
ఐడెన్ మార్‌క్రమ్‌ 49 బంతుల్లో – దక్షిణాఫ్రికా vs శ్రీలంక – ఢిల్లీ, 2023
కెవిన్ ఓబ్రియన్ 50 బంతుల్లో – ఐర్లాండ్ vs ఇంగ్లండ్ – బెంగళూరు, 2011
గ్లెన్ మాక్స్‌వెల్ 51 బంతుల్లో – ఆస్ట్రేలియా vs శ్రీలంక – సిడ్నీ, 2015
ఏబీ డివిలియర్స్ 52 బంతుల్లో – దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ – సిడ్నీ, 2015
ఇయాన్ మోర్గాన్ 57 బంతుల్లో – ఇంగ్లండ్ vs ఆఫ్ఘనిస్తాన్ – మాంచెస్టర్, 2019
హెన్రిచ్ క్లాసెన్ 61 బంతుల్లో – దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ – ముంబై
రోహిత్ శర్మ 63 బంతుల్లో – భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ – ఢిల్లీ, 2023
కుసాల్ మెండిస్ 65 బంతుల్లో – శ్రీలంక vs పాకిస్థాన్ – హైదరాబాద్, 2023
మాథ్యూ హేడెన్ 66 బంతుల్లో – ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా – బస్సెటెర్రే, 2007
జాన్ డేవిసన్ 67 బంతుల్లో – కెనడా vs వెస్టిండీస్ – సెంచూరియన్, 2003
పాల్ స్టిర్లింగ్ 70 బంతుల్లో – ఐర్లాండ్ vs నెదర్లాండ్స్ – కోల్‌కతా, 2011
కుమార సంగక్కర 70 బంతుల్లో – శ్రీలంక vs ఇంగ్లండ్ – వెల్లింగ్టన్, 2015
ఆడమ్ గిల్‌క్రిస్ట్ 72 బంతుల్లో – ఆస్ట్రేలియా vs శ్రీలంక – బ్రిడ్జ్‌టౌన్, 2007
కుమార సంగక్కర 73 బంతుల్లో – శ్రీలంక vs బంగ్లాదేశ్ – మెల్‌బోర్న్, 2015

Exit mobile version