NTV Telugu Site icon

PM Modi: గీతాప్రెస్ ఓ దేవాలయం, గాంధీజీకి ప్రత్యేక అనుబంధం ఉంది.. కాంగ్రెస్‌కు కౌంటర్

Gita Press

Gita Press

PM Modi: గీతా ప్రెస్ ఆలయం కంటే తక్కువ కాదు, సజీవ విశ్వాసం అని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన గీతా ప్రెస్‌ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ ప్రసంగించారు. “గీతా ప్రెస్ ప్రపంచంలోని ఏకైక ప్రింటింగ్ ప్రెస్, ఇది ఒక సంస్థ మాత్రమే కాదు, సజీవ విశ్వాసం. గీతా ప్రెస్ కేవలం ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే కాదు, కోట్లాది మందికి దేవాలయం” అని ప్రధాని అన్నారు. గీతా ప్రెస్‌తో మహాత్మా గాంధీకి ప్రత్యేక అనుబంధం ఉందని కూడా ఆయన నొక్కి చెప్పారు. గీతా ప్రెస్‌కి గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ విమర్శించింది. గీతా ప్రెస్‌కి గాంధీ శాంతి బహుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, గీతా ప్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. గాంధీ తమ పక్షంవారీ మ్యాగజైన్ ‘కల్యాణ్’కి రెగ్యులర్ కంట్రిబ్యూటర్ అని స్పష్టం చేసింది.

Also Read: ISRO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇస్రోలో ఖాళీలు.. పూర్తి వివరాలు..

కాంగ్రెస్ చేసిన వాదనలను ఖండిస్తూ, గాంధీ, గీతా ప్రెస్ మధ్య ఉన్న సన్నిహిత అనుబంధాన్ని ప్రధాని మోడీ ఎత్తిచూపారు. “‘కల్యాణ్’ పత్రిక ద్వారా గీతా ప్రెస్‌ కోసం ఆయన ఎన్నో రచనలు చేశారు. గీతా ప్రెస్‌ భారత దేశాన్ని ఏకం చేయడంతోపాటు, దేశ ఐకమత్యానికి బలాన్ని చేకూరుస్తుంది. 15 భాషల్లో 1,600 పైగా ప్రచురణలు చేసింది. 1923లో గీతా ప్రెస్‌ ఆధ్యాత్మిక వెలుగులను ప్రారంభించింది. ప్రస్తుతం అది మానవత్వానికి దిక్సూచిగా మారింది. వందల ఏళ్ల క్రితం వలసవాద శక్తులు భారత దేశాన్ని దోపిడీ చేసి, మన గురుకులాలను ధ్వంసం చేశాయి. అలాంటి సమయంలో గీతా ప్రెస్ మార్గదర్శిగా నిలిచి దేశవ్యాప్తంగా ఎంతో మందికి చేరువైంది. అలాంటి సంస్థ శతాబ్ధి ఉత్సవాలను వీక్షించడం మనందరి అదృష్టం. గీతా ప్రెస్‌ కేవలం ప్రెస్ మాత్రమే కాదు. కోట్ల మంది ప్రజల విశ్వాసం, ఎంతో మందికి దేవాలయం.” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Also Read: Flipkart: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. 30 సెకన్లలోనే పర్సనల్‌ లోన్‌..

ముఖ్యంగా గంగా నదిని పరిశుభ్రంగా ఉంచడంలో, అలాగే దేశ నిర్మాణంలో దాని పాత్రను పర్యావరణ అవగాహన కోసం గీతా ప్రెస్ అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రధాని మోడీ హైలైట్ చేశారు.1923లో గోరఖ్‌పూర్‌లో ఏర్పాటైన గీతా ప్రెస్‌ని 2021 గాంధీ శాంతి బహుమతికి ప్రధాని మోడీ నేతృత్వంలోని జ్యూరీ ఎంపిక చేసింది. 1995లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గాంధీ శాంతి బహుమతి, మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలిగా ఈ అవార్డును అందిస్తారు. ప్రారంభమైనప్పటి నుండి 42 కోట్లకు పైగా హిందూ మత పుస్తకాలను ప్రచురించిన గీతా ప్రెస్ ప్రచురించింది. ప్రపంచంలోనే హిందూ మత పుస్తకాలను ప్రపంచంలోనే ప్రచురించిన అతిపెద్ద ప్రచురణకర్తగా పేరొందింది.

శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, నేపాల్ నుంచి ఒక పండితుడు సంపాదకత్వం వహించిన శివపురాణం ప్రత్యేక సంచికను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అందులో శివుడు, పార్వతి, గణేష్‌ల 200 ఫోటోలు ఉన్నాయి. గోరఖ్‌పూర్‌లో ప్రధాని పర్యటన శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోడీ వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. గోరఖ్‌పూర్‌లో ప్రధాని మోదీకి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు.

Show comments