Taliban Rule: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి నుంచి బాలికలు, మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో పాఠశాలలు మూసివేయడంతో బాలికలు ఇప్పుడు కుట్టు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేయబడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మంది బాలికలు అల్లికలు, కుట్టు శిక్షణ తీసుకుంటున్నారు. అదే సమయంలో వారు పాఠశాలలను తిరిగి తెరవాలని తాలిబన్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాలిబన్లు మహిళా విద్యార్థులకు మూసివేయబడిన కళాశాలలు, విశ్వవిద్యాలయాలను తిరిగి తెరవాలని కొందరు మహిళా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమిక విద్యపై బాలికల హక్కులను తాలిబన్లు హరించివేస్తున్న తరుణంలో, బాలికలు కుట్టు నేర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నారని టోలో న్యూస్ నివేదించింది.
Also Read: Shocking Video: రైలు కింద పడ్డ బతికి బట్టకట్టింది.. ఈ కుక్కకు నూకలున్నాయి..!
అమ్మాయిలు ఏం చెప్పారంటే?
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై తాలిబన్లు విధించిన ఆంక్షలను ఖండిస్తూ మరియం అనే విద్యార్థిని మాట్లాడుతూ.. “తాలిబన్‌లు ఆడపిల్లల కోసం పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను తెరవాలని కోరుకుంటున్నాము. తద్వారా వారు అబ్బాయిల వలె చదువుకోవచ్చు వారి చదువును కొనసాగించవచ్చు.” అని అన్నారు. మరో విద్యార్థి జహ్రా కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం కారణంగా టైలరింగ్ శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు విద్యార్థిని తెలిపింది.
