NTV Telugu Site icon

Girls Fight Video: ఫుల్లుగా తాగి చితక్కోట్టుకున్న అమ్మాయిలు.. బాపురే ఏందీ సామి ఇది..

Girls Fight

Girls Fight

ఒకప్పుడు అమ్మాయిలు మద్యం వాసన అంటే ఆమడ దూరం ఉండేవారు.. కానీ ఇప్పుడు మాత్రం మత్తులో తులుతున్నారు.. అంతేకాదు మగవాళ్ళను మించి హంగామా చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకవైపు అధికారులు ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా అమ్మాయిలు కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ప్రేమికుల రోజున పుల్లుగా తాగి బూతులు తిడుతూ యువకుడిని చితక్కొట్టిన అమ్మాయిలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ ఘటన లక్నోలో వెలుగు చూసింది.. వాలెంటైన్స్ డే రోజున ఇద్దరు యువతులు తాగిన మత్తులో ఒక వ్యక్తితో గొడవ పడుతున్న వీడియో క్లిప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ X లో షేర్ చేయబడింది.. షేర్ చేసిన క్షణాల్లోనే వీడియో తెగ వైరల్ అయ్యింది..

ఆ వైరల్ అవుతున్న వీడియోలో మహిళల అసభ్యపదజాలంతో దూషిస్తూ కొట్టుకోవడం చూపిస్తోంది. ప్రారంభంలో, ఇద్దరు మహిళలను వేరు చేయడానికి అక్కడున్నవారు జోక్యం చేసుకునేలోపు వాగ్వాదం మరీ ఎక్కువ అయింది.ఫుటేజ్‌లో, మహిళలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడం చూసేవారు పరిస్థితిని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు.. మొత్తానికి వీడియో మాత్రం ట్రెండ్ అవుతుంది..