NTV Telugu Site icon

Rifle Bullets In Train: వందలాది రైఫిల్ బుల్లెట్లతో రైలులో ప్రయాణించిన అమ్మాయి

Grp Police

Grp Police

Rifle Bullets In Train: ఉత్తరప్రదేశ్ లోని బల్లియాలో GRP బుధవారం వారణాసి ఛప్రా ప్యాసింజర్ రైలు నుండి రైఫిల్స్ సంబంధించిన 750 బుల్లెట్లతో ఒక అమ్మాయిని అరెస్టు చేసారు పోలీసులు. మిర్జాపూర్‌కు చెందిన బాలిక బట్టలకు బదులు ట్రాలీ బ్యాగ్‌లో బుల్లెట్లు పెట్టుకుని చాప్రా వెళ్తోంది. ప్రస్తుతం పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైఫిల్స్ కాకుండా, ఈ 315 బోర్ బుల్లెట్లను నేరస్థులు అక్రమ పిస్టల్స్‌లో ఉపయోగిస్తారు. ఇక బాలిక విచారణలో మరో ఇద్దరి పేర్లు బయటపడ్డాయి. పోలీసులు అమ్మాయిపై ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read Also: Big C Mobiles Offers: ‘బిగ్ సీ’లో బంపర్ ఆఫర్స్.. ప్రతి మొబైల్​ కొనుగోలుపై 10 వేలు..!

గోరఖ్‌పూర్ ఎస్పీ ఆదేశాల మేరకు జీఆర్‌పీ బుధవారం రైళ్లలో ఇంటెన్సివ్ చెకింగ్ మొదలు పెట్టింది. కాగా, వారణాసి నుంచి చాప్రా వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఉదయం 8.40 గంటల ప్రాంతంలో స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుంది. రెండో బోగీలో కూర్చున్న ఓ బాలిక సీటు కింద ఉన్న ట్రాలీ బ్యాగ్‌ని జీఆర్పీ తనిఖీ చేయగా అందులో వందలాది కాట్రిడ్జ్‌లు ఉండడంతో అక్కడి వారందరు ఆశ్చర్యానికి గురయ్యారు. దాంతో బాలికను బ్యాగ్‌తో సహా స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Read Also: Canada Govt: కెనడా సర్కార్ మరో కీలక నిర్ణయం.. వలసదారుల సంఖ్య భారీగా తగ్గింపు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విచారణలో అంకిత్ కుమార్ పాండే, రోషన్ యాదవ్ తనకు క్యాట్రిడ్జ్‌లతో కూడిన బ్యాగ్ ఇచ్చారని బాలిక చెప్పింది. ఆ సంచి చాపర్‌లోని ఓ వ్యక్తికి ఇవ్వాల్సి ఉందని తెలిపింది. బాలికను మీర్జాపూర్‌లోని రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిహార్ నివాసి మణితా సింగ్‌గా గుర్తించారు. బాలికతో పాటు ఘాజీపూర్‌ జిల్లా కరీముద్దీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బరాచ్‌వార్‌ నివాసి సుశీల్‌ పాండే కుమారుడు అంకిత్‌ కుమార్‌ పాండే, నసీర్‌పూర్‌ కటారియా నివాసి రామ్‌నారాయణ్‌ సింగ్‌ యాదవ్‌ కుమారుడు రోషన్‌ యాదవ్‌పై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు సంబంధించి ఒక టీమ్ ఛప్రా వెళ్తుంది. ప్రస్తుతం ఇంత పెద్ద సంఖ్యలో బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయో పోలీసులు ఆరా తీస్తున్నారు. వాటిని బట్వాడా చేసేది ఎవరు? ఈ కేసులో ఎంత పెద్ద రాకెట్‌ దాగుందని పోలీసులు అనుమానిస్తున్నారు.