Site icon NTV Telugu

Uttar Pradesh: వెంటపడొద్దు అన్నందుకు శానిటైజర్ తాగించి చంపాడు

Up Dead

Up Dead

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శానిటైజర్ లో విషపదార్థాలు కలిపి ఓ విద్యార్థినికి తాగించి హత్య చేశాడు. అయితే అంతకుముందు విద్యార్థిని వెంటపడుతుండటంతో.. విద్యార్థిని పడొద్దు అని చెప్పింది. దీంతో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. విద్యార్ధిని మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. విద్యార్ధిని మృతిపై న్యాయం కావాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Bandaru Vijaya laxmi: బండారు విజయలక్ష్మి పొలిటికల్ ఎంట్రీ.. ఆ నియోజకవర్గం నుంచే!

మృతదేహాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. మృతి చెందిన విద్యార్థిని మీనాక్షి ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. గత కొంత కాలంగా కాలేజీకి వెళ్లే సమయంలో ఐమత్ రాథోడ్ అనే యువకుడు మీనాక్షి వెంటపడేవాడని విద్యార్థిని సోదరుడు చెప్పాడు. ఈ ఘటన జూలై 27న జరిగింది. కాలేజీ సమీపంలో విద్యార్థిని మీనాక్షిని వెంటపడి వేధింపులకు గురిచేశాడని మృతురాలి సోదరుడు తెలిపాడు. నిందితుడు వేధింపులకు పాల్పడుతున్న సమయంలో మీనాక్షి సోదరుడు కూడా అక్కడే ఉన్నట్లు తెలిపాడు. మరోవైపు తనపై కూడా నిందితుడితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు దాడి చేసినట్లు పేర్కొన్నాడు.

TMC MP: టీఎంసీ ఎంపీపై ఈడీకి ఫిర్యాదు.. తక్కువ ధరకే త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఇస్తామని మోసం చేసిందని కంప్లైంట్

మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మీనాక్షి మంగళవారం మృతి చెందిందని విద్యార్థి తండ్రి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, బంధువులు.. నిందితుడిని తమకు అప్పగించాలంటూ.. తామే శిక్షిస్తామని తెలిపారు. ఓ వైపు ప్రభుత్వం ‘బేటీ పఢావో బేటీ బచావో’ అంటూ ప్రచారం నిర్వహిస్తూనే.. మరోవైపు విద్యార్థినులను చంపేస్తున్నారని బాలిక తండ్రి ఆరోపించారు. నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. పోలీసులే మమ్మల్ని బెదిరిస్తున్నారని బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై జులై 28న బరేలీలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రాహుల్ భాటి తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Exit mobile version