NTV Telugu Site icon

Noida: వెరీ లక్కీ.. కారు బైక్‌ను ఢీకొనడంతో ఎలివేటెడ్ పిల్లర్‌పై వచ్చి పడ్డ యువతి (వీడియో)

Noida

Noida

ఆ అమ్మాయికి ఇంకా భూమ్మీద బ్రతికే అవకాశం ఉంది. అందుకే.. ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను కారు వచ్చి ఢీకొట్టిన అదృష్టవశాత్తు ఆమెకు ఏమీ కాలేదు. ఆశ్చర్యమేంటంటే.. ఆమె ఎలివేటెడ్ పిల్లర్ పై వచ్చి పడింది. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 25 సమీపంలో శనివారం మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో జరిగింది. ఇద్దరు స్నేహితులు కలిసి నోయిడా నుంచి ఘజియాబాద్‌లోని తమ ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Read Also: Crime: పిల్లలు లేరనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య.. వారి వయసు 28 ఏళ్లే

వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ బైక్ పై ఎలివేటెడ్ రోడ్డుపై వెళ్తుండగా కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో.. యువతి ఎలివేటెడ్‌ రోడ్డుపై నుంచి కిందపడి ఎలివేటెడ్‌ రోడ్డు పిల్లర్‌పై ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆమెను రక్షించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. చివరకు సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో చాలా మంది వ్యక్తులు పిల్లర్ పై చిక్కుక్కున్న యువతిని రక్షించడానికి ప్రయత్నించినట్లు ఉంది.

Read Also: Lebanon: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లలో ఈ బ్యూటీ హస్తం..! ఈమె ఎవరో తెలుసా..?

ఈ ఘటనపై ఏడీసీపీ మనీష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. నోయిడా నుంచి ఘజియాబాద్ వెళ్తున్న యువతి స్కూటర్ ను కారు ఢీకొట్టడంతో ఎలివేటెడ్ రోడ్డు పిల్లర్‌పై పడిపోయిందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. అదృష్టవశాత్తూ పిల్లర్‌పై నుంచి యువతి కింద పడపోకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను సురక్షితంగా రక్షించారని చెప్పారు. అయితే.. పిల్లర్‌పై పడిపోవడంతో యువతికి గాయాలయ్యాయని.. ఆమెను ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. క్రేన్‌ సహాయంతో పిల్లర్‌పై ఇరుక్కుపోయిన యువతిని రక్షించారు. యువతిని సురక్షితంగా కిందకు దించేందుకు మరో ఇద్దరు వ్యక్తులు శ్రమించారు.