A Minor Girl Physically Harassed At Ibrahimpatnam Village.
ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు విధించినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా తమ కామవాంఛ తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. అంతేకాకుండా.. చివరికి జీవితాలు అంధకారమయంగా మార్చుకుంటున్నారు. అన్యపుణ్యం తెలియని 9వ తరగతి ఓ మైనర్ విద్యార్థినిని బెదిరించి యువకుడు పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే సదరు మైనర్ బాలికకు గర్భం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక 9వ తరగతి చదువుతోంది. అయితే సదరు మైనర్ బాలికను నిందితుడు కుప్పాటి స్వామి(21) మాయమాటలు చెప్పి లొంగదీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు.
EX MP Vivek : రాష్ట్రం అప్పుల పాలయింది.. కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారు..
అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఇలా పలు మార్లు బాలికను బెదిరింది అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే గత కొన్ని రోజులుగా బాలిక అనారోగ్యంగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు.. ఆసుపత్రి తీసుకువెళితే బాలిక గర్భవతి అని తేలింది. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా కుప్పటి స్వామి అనే యువకుడు భయపెడతూ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని వివరించింది బాధిత బాలిక. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
