Site icon NTV Telugu

China : దొంగను ప్రేమించిన అమ్మాయి.. బుద్ధి చూపించుకున్న ప్రియుడు..రూ.11లక్షలతో పరార్

New Project (87)

New Project (87)

China : ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమలో ఉన్న వ్యక్తికి తను ప్రేమించే వాళ్లు ఏది చెప్పినా నమ్మకంగా ఉంటుంది. అలాంటి వాళ్లు కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోరు. తీరా వాళ్లు మోసం చేసిన తర్వాతనే అసలు విషయం తెలుసుకుని బుద్ధి తెచ్చుకుంటారు. అలాగే ఓ యువతి ఓ దొంగను గుడ్డిగా ప్రేమించింది. అతడు తన దొంగ బుద్ధి చూపించడంతో ప్రస్తుతం లబోదిబోమంటుంది. విషయం చైనాలోని షాంఘై నగరానికి సంబంధించినది. వివరాల్లోకి వెళితే.. 40 ఏళ్ల మహిళ మోసగాడితో ప్రేమలో పడింది. హూ అనే మహిళ గత ఏడాది మేలో ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో చెన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. హూని మోసం చేసి రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టేలా చేశాడు. హు డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు, ఆమె మోసానికి గురైనట్లు గ్రహించింది.

Read Also:Sai Dharam Tej : జేడీ మాస్టర్ అంటూ పవన్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ధరమ్ తేజ్..

మోసపోయిన తర్వాత హు చెన్‌ను సంప్రదించినప్పుడు, అతను మళ్లీ కొత్త కథనాన్ని రచించారు. అతను మయన్మార్‌లో ఒక స్కామ్‌లో ఇరుక్కుపోయానని.. అందుకే అతను తన డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా చేసుకోలేకపోయావని పేర్కొన్నాడు. ఇంత జరిగినా ఆమెకు స్పృహ రాలేదు. ఎందుకంటే అతని కళ్లకు ప్రేమ ముసుగు ఉండిపోయింది. ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయిన తర్వాత తాను కూడా దొంగతనాలు చేయడం ప్రారంభించింది. చెన్ తో పాటు ప్రజలను మోసం చేయడం మొదలు పెట్టింది. చెన్ హు ఖాతా నుండి మాత్రమే మోసపూరిత లావాదేవీలను నిర్వహించేవారు. దీనికి బదులుగా హు కూడా మొత్తంలో కొంత భాగాన్ని అందుకునేవారు. గతేడాది సెప్టెంబర్‌లో పోలీసులు హును అరెస్టు చేశారు. హు పోలీసులకు తన నేరాన్ని అంగీకరించింది. ఆమెకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా మాత్రమే విధించారు.

Read Also:Heart Attack : హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే రోజూ వీటిని తినాలి..

Exit mobile version