ఈ రోజుల్లో ప్రేమికులు ప్రేమ కోసం ఎంతటిదానికైనా తెగిస్తున్నారు. ప్రేమ కోసం కన్నతల్లిదండ్రులనే కడతేరుస్తున్నారు యువతీ యువకులు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ ను కలువనివ్వడం లేదని ఓ టీనేజ్ అమ్మాయి తల్లికి విషమిచ్చింది. రాయ్ బరేలీలో నివసించే సంగీత యాదవ్ (48) అనే మహిళకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. కొంతకాలంగా ఆ అమ్మాయి ఓ అబ్బాయితో చనువుగా ఉంటోంది. ఈ విషయం గమనించిన సంగీతా యాదవ్… ఆ యువకుడితో తిరగొద్దు.. కలుసుకోవద్దని చెప్పింది. దీంతో తన తల్లిపై కోపం పెంచుకుంది బాలిక.
Read Also: BRS Joinings: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన గోప్లపూర్ కాంగ్రెస్ నేతలు
బాయ్ ఫ్రెండ్ కు, తనకు మధ్య తల్లి అడ్డుగా ఉందని భావించిన బాలిక.. తల్లిని అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసింది. అయితే బాలిక తన బాయ్ ఫ్రెండ్ కు మార్కెట్ నుంచి విషం తీసుకుని రావాలని చెప్పింది. ఆ తర్వాత తల్లి తాగే టీలో విషం కలిపి ఇచ్చింది. దీంతో టీ తాగిన సంగీతా యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే.. ఈ పరిణామంతో భయపడిపోయిన బాలిక ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది. దాంతో వారు సంగీతా యాదవ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆమె ప్రాణాలకు ముప్పులేదని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు టీనేజ్ అమ్మాయి, ఆమెకు సహకరించిన ప్రియుడిపై సెక్షన్ 328 కింద కేసు నమోదు చేశారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టారు.
Read Also: IND vs AUS: భారత్ స్పిన్ మాయాజాలం.. ఆస్ట్రేలియా ఆలౌట్! టీమిండియా టార్గెట్ ఎంతంటే?
