NTV Telugu Site icon

Family Murder: ప్రేమికుడి కోసం 13 మంది కుంటుంబసభ్యుల ప్రాణాలను బలికొన్న అమ్మాయి

Posion

Posion

Family Murder: ఒక అమ్మాయి తన ప్రేమ కోసం తన కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేసింది. పాకిస్థాన్‌ లోని సింధ్ ప్రావిన్స్‌లో తన కుటుంబానికి చెందిన 13 మందిని చంపిన బాలికను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతి ఇష్టానుసారం పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధంగా లేకపోవడంతో అమ్మాయి ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ మరణాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయికి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబసభ్యులు అనుమతించకపోవడంతో బాలిక ఆగ్రహంతో ఈ ఘాతకానికి పాల్పడింది.

Amit Shah: నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ..

ఈ ఘటనలో ఆమె తన ప్రేమికుడితో కలిసి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేందుకు కుట్ర పన్నిందని పోలీసులు తెలిపారు. ఖైర్‌పూర్ సీనియర్ పోలీసు అధికారి ఇనాయత్ షా మాట్లాడుతూ.., విషం కలిపిన ఆహారం తిన్న తర్వాత, మొత్తం 13 మంది సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారందరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారందరూ మరణించారు. వారందరికి పోస్టుమార్టం చేయగా.. విషపూరిత ఆహారం వల్లే మృతి చెందినట్లు తేలింది.

Off The Record : ఎంవీవీ సత్యనారాయణ పొలిటికల్ రిటైర్డ్ హర్ట్ అవుతున్నారా ? రాజకీయాలకు దూరం అవుతున్నారా ?

దింతో పోలీసులు క్షుణ్ణంగా విచారించగా, ఆ అమ్మాయి, ఆమె ప్రేమికుడు ఇంట్లో బ్రెడ్ చేయడానికి ఉపయోగించే గోధుమలలో విషం కలిపినట్లు తేలిందని తెలిపారు. అమ్మాయికి నచ్చిన అబ్బాయితో పెళ్లి చేయడానికి ఆమె కుటుంబం సిద్ధంగా లేనందున ప్రియుడి సాయంతో గోధుమల్లో విషం కలిపినట్లు బాలిక అంగీకరించిందని తెలిపారు.

Show comments