Andhra Pradesh: సమాజంలో అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు.. కొందరు చదుకొంటే.. కొందరు చదువుకునేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి.. ఇక, చదువుకుంటే ఏమి వస్తుంది.. కూలి ఏస్తే కొన్ని డబ్బులైనా వస్తాయంటూ.. పిల్లలను తమ వెంట పనికితీసుకెళ్లే తల్లిదండ్రులు కూడా ఉన్నారు.. మరికొందరు తాము పడిన కష్టం పిల్లలు పడకూడదంటూ.. అప్పులు చేయి అయినా.. పిల్లలను చదివించుకునేవారు ఉన్నారు.. అయితే, కర్నూలు జిల్లాలో తన తల్లిపై అధికారులకు ఫిర్యాదు చేసింది ఓ బాలిక.. ఈ ఏడాది టెన్త్ పాసైన నిర్మలమ్మ అనే బాలిక.. టెన్త్‌లో ఏకంగా 534 మార్కులు సాధించింది.. తనకు పై చదువులు చదవాలనే కోరిక ఉన్నా.. ఆమెను చదివించలేని పరిస్థితి ఆ కుటుంబానిది.. ఆ బాలిక ఎన్నిసార్లు తన తల్లికి మొరపెట్టుకున్నా.. తన కల తీరాలా కనిపించలేదు ఆ బాలికకు.. దీంతో.. అధికారులకు ఫిర్యాదు చేసింది..
Read Also: Dal: కందిపప్పు ధరలను అదుపు చేసేందుకు.. చర్యలు మొదలెట్టిన ప్రభుత్వం
ఆదోని మండలం పెద్దహరివానంలో తాజాగా అధికారిక కార్యక్రమానికి వచ్చారు తహశీల్ధారు, ఎంపీడీవో, ఎస్‌ఐ.. అయితే, తన తల్లిపై వారికి ఫిర్యాదు చేసింది నిర్మలమ్మ.. టెన్త్ లో తనకు 534 మార్కులు వచ్చాయని.. పై చదువులు చదుకోవాలని ఉంది.. కానీ, మా అమ్మ నన్ను చదివించడంలేదు.. ఎలాగైనా నా తల్లిని ఒప్పించండి అంటూ అధికారులను వేడుకుంది.. అయితే, పేదరికంతో ఉన్న ఆ తల్లి.. తన వెంట కూతురిని కూలికి తీసుకెళ్తోంది.. ఇద్దరం పనిచేస్తేనే.. నాలుగువేళ్లు నోట్లోకి వెళ్తాయనేది ఆ తల్లి ఆవేదన.. కానీ, చదువుపై ఉన్న ప్రేమతో.. తనను కనిపెంచిన తల్లిపైనే అధికారులకు ఫిర్యాదు చేసింది నిర్మలమ్మ.. దీంతో, ఆ తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అధికారులు.. ప్రభుత్వ పథకాల ద్వారా నిర్మలమ్మను చదివించే బాధ్యత తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. మరి నిర్మలమ్మ కష్టాలు తీరి.. మళ్లీ బ్యాగ్ భుజానికి వేస్తుందో..? ఉన్నత చదువులు చదువుతుందేమో చూడాలి..