Crime News: మంత్రాలయం సమీపంలో కర్ణాటక గిలకసూగూరు క్యాంపులో దారుణం జరిగింది. ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశారు. హత్య చేయడమే కాకుండా ఆ యువతి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుడగజంగాల సామాజిక వర్గానికి చెందిన యువతిగా గుర్తించారు. ఆ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read: Women Harassment: టాలీవుడ్ లేడీ డైరెక్టర్ ను వేధించిన పోకిరి.. పార్క్ లో వాటిని చూపిస్తూ..
ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. గ్రామాల్లో తిరుగుతూ వస్తువులు అమ్మే బాలికపై యువకులు కన్నేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ యువతి ఇంటికి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాలిక అక్కడికక్కడే మృతి చెందగా.. మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.