NTV Telugu Site icon

Ginna Twitter Review: మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ.. ట్విట్టర్ రివ్యూ

Ginna Romantic Song

Ginna Romantic Song

Ginna Twitter Review: మంచు విష్ణు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన తాజాగా నటించిన జిన్నా సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోనీ హీరోహీరోయిన్లుగా నటించారు. డైరక్టర్ శ్రీనువైట్ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఈశాన్ సూర్య ఈ చిత్రానికి దర్శకుడు. అంతకు ముందు సూర్య ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ అనే చిన్న సినిమాకు దర్శకత్వం వహించారు. జిన్నా సినిమాకు కామెడీ ఎంటర్‌టైనర్లను తీసిన సీనియర్ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి కథ అందించారు. అవ్‌రామ్ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. సునీల్, వెన్నెల కిషోర్, చంద్ర, సద్దాం, అన్నపూర్ణ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Read Also: Singer Suneetha: సింగర్ సునీతను చూసి నెటిజన్స్ ఫిదా.. హాట్ సింబల్ ఎమోజీలు షేర్

ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది జిన్నా సినిమా. ఎప్పుడూ ప్రేక్షకులు కామెడీ సినిమాలను ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ చిత్ర విజయంపై గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నారు హీరో మంచు విష్ణు. అందుకే కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు. యూఎస్, యూకే, మలేసియాలో సైతం ‘జిన్నా’ను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే విష్ణు ప్రకటించారు. అలాగే నేడు ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చింది.. చాలా మంది సినిమా బాగుందని పోస్టులు పెడుతున్నారు. మరి ట్విట్టర్లో ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం..

‘‘జిన్నా మూవీ చూశాను. ‘ఢీ’ లాంటి కామెడీ టైమింగ్‌తో మంచు విష్ణు కమ్‌బ్యాక్ ఇచ్చారు. సన్నీ లియోనీ కోసమే థియేటర్‌కు వెళ్లే వారు కచ్చితంగా బాధపడరు. హారర్ కామెడీ జోనర్‌ను ఎంపిక చేసుకొని మంచు విష్ణు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలింది మౌత్ టాక్‌కి వదిలేద్దాం. నా రేటింగ్ 3/5. చిత్ర బృందానికి అభినందనలు’’ అని ఒక ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. ఈ యూజర్ లండన్ నుంచి ఈ ట్వీట్ చేశారు.

Read Also: Kantara: కాంతారా ఎఫెక్ట్.. భూత కోల నర్తకులకు అలవెన్స్

అలాగే మరో ట్విట్టర్ యూజర్ సైతం రివ్యూ ఇచ్చేశారు. ‘‘కథ ఫర్వాలేదు. సినిమా కాస్త నెమ్మదించింది. కానీ, సన్నీని విష్ణు కలిసినదగ్గర నుంచి కిక్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ అదిరిపోయాయి. విష్ణు నటన, ఆయన నిబద్ధత సూపర్. క్లైమాక్స్ మామూలుగా లేదు. రేటింగ్ 3.23/5. నిన్ను చూసి గర్వపడుతున్నా విష్ణు అన్న. సూపర్ ఉంది మూవీ’’ అని పేర్కొన్నాడు. ఈ రివ్యూపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Show comments