NTV Telugu Site icon

Gidugu Rudra Raju: దేశ ఆర్థిక భద్రతకు కాంగ్రెస్ నిరంతర పోరాటం

Gidugu Rudraraju

Gidugu Rudraraju

దేశంలో ఆర్ధిక భధ్రత‌ కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన వ్యక్తి ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 2 స్ధానానికి ఎలా ఎగబాకారు..?ఆదాని సంస్ధలపై మొదటి నుంచి రాహుల్ గాంధీ గళమెత్తుతూనే ఉన్నారు. మన రాష్ట్రంలోని రెండు పోర్టులను ఆదాని గ్రూపే‌ కైవసం చేసుకుంది.ప్రధాని ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారు.దీనిపై ప్రధాని మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవస్ధపై, దేశభక్తి పై మోడీకి నమ్మకముందని చెబుతారు.. కాని కార్పొరేట్ సంస్ధల కీలు బొమ్మగా మారిపోయారు.

Read Also: Jagga Reddy: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉండదు.. రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్

రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలి.కేంద్రం తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ భయపడదు. సీఎం జగన్‌ కు రంగుల ఫోబియా పట్టుకుంది. సిఎం జగన్ పరిపాలన మానేసి బిల్డింగులపై రంగులు వేసే పని పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో అంధ బాలికపై అత్యాచారం, హత్య జరగడం అమానుషం. ఇంత కిరాతకంగా నిందితులు వ్యవహరిస్తున్నా చోద్యం చూస్తున్నారు.ప్రతిపక్షాల గొంతు నొక్కాలనే ఆలోచన తప్ప లా అండ్ ఆర్డర్ పై దృష్టి లేదు.ఇళ్లకు జగనన్న స్టిక్కర్లు వేయడం దుర్మార్గం.జగన్ పాలనలో ఉద్యోగులకు భధ్రత లేదు.. జీతాలు లేవు.

దుర్గగుడిలో పాలకమండలి సభ్యులను చూస్తుంటే బాధాకరంగా ఉంది.పాలకమండలి సభ్యుల్లో ఛీటింగ్ కేసు ఉన్నవాళ్లు, క్రిమినల్స్ కమిటీలో ఉన్నారు.భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాంగ్రెస్ పార్టి ఉద్యమిస్తుంది.అవసరమైతే కోర్టుకు వెళతాం. తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చడం మంచిది కాదు.ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు.. ముఖ్యమంత్రి మంచి పాలన చేయాలి.. అంతే కాని పేర్లు మార్పు కాదు.కార్పొరేట్ మాఫియాగా ఆదాని గ్రూప్ వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది. అదాని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కలిసే చేస్తున్నట్లు అనిపిస్తుందన్నారు.

Read Also: IT, Engineering Recruitment: 16, 17 తేదీల్లో బెంగళూరులో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌