Gidugu Rudraraju: మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో ఆయనే క్లారిటీ ఇవ్వాలన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్ర రాజు.. అయితే, జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారానికి రావడం చిరంజీవి వ్యక్తిగతం అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు గౌరవం ఉందని చిరంజీవి చెప్పారు.. కానీ, ఒత్తుళ్లకు లొంగి జనసేన ప్రచారానికి వెళ్తుతున్నారని అనుకుంటున్నాం అన్నారు. ఇక, చంద్రబాబుకు రాజకాంక్ష తప్ప ప్రజాకాంక్ష లేదని విమర్శించారు. చంద్రబాబు ఎన్డీఏ కూటమీతో పొత్తులు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రత్యేక హోదా ఇవ్వలేదని గతంలో బయటికి వచ్చి.. దీక్షలు చేసిన చంద్రబాబు మళ్లీ ఎందుకు కలిశారు ? అని నిలదీశారు.
Read Also: Robert Vadra: “దేశం నన్ను కోరుకుంటోంది”.. పొలిటికల్ ఎంట్రీపై ప్రియాంకాగాంధీ భర్త..
ఇక, రాష్ట్రాన్ని మోసం చేయడంలో చంద్రబాబుది పెద్దపేట తర్వాత స్థానంలో వైఎస్ జగన్ అని ఆరోపించారు గిడుగు రుద్రరాజు.. వైసిపి నవరత్నాలు నవ మోసాలుగా అభిర్ణించిన ఆయన.. నవ మోసాలు వంటి మేనిఫెస్టోతో సీఎం జగన్ మరోసారి రాష్ట్ర ప్రజల్ని దగా చేస్తారు అని హెచ్చరించారు. బీజేపీకి టీడీపీ పొత్తులో ఉంటే వైసీపీ తొత్తుగా ఉంది.. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 16 బిల్లులకు వైసీపీ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. రిజర్వేషన్లు తీసివేస్తామని అమిత్ షా స్వయంగా చెప్పారు.. కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే రిజర్వేషన్లకు రక్షణ అన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ మార్పుకు గొప్ప అవకాశం ఉందన్నారు.. పెన్షన్ల పంపిణీపై ఈనెల 26న ఎన్నికల సంఘం మరోసారి అదేశాలు ఇచ్చింది.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ సిబ్బంది ద్వారా పాత విధానంలో పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాజమండ్రి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్ర రాజు.