NTV Telugu Site icon

Gidugu Rudra Raju : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగింది

Gidugu Rudra Raju

Gidugu Rudra Raju

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు ఏపీ మాజీ పీసీసీ గిడుగు రుద్రరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 10 ఏళ్లుగా అమలు పరచకుండా ఇప్పుడు అమలు చేస్తామంటున్నారని, పోలవరం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్యాకేజి బావుందని చంద్రబాబు ప్యాకేజి తీసుకున్నారని, ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి చేసిన మేలు ఏమి లేదన్నారు రుద్రరాజు. రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, అమరావతి నిర్మాణానికి ఇచ్చే 15 వేల కోట్లు గ్రాంట్ లేక రుణమా అనేది స్పష్టంగా చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కడప స్టీల్ ప్లాంట్,విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేదని, ఏపీకి ప్రత్యేక నిధులను కేంద్రం కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Paris Olympics 2024: 129 ఏళ్ల ఒలింపిక్ చరిత్ర.. నదిలో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..

ప్రధాని ఏపీని ప్రత్యేకంగా చూడాలని, 12 లక్షల ఆర్ధిక భారం ఉన్న ఏపీకి మళ్ళీ రుణం ఇప్పిస్తామన్నట్లుగా ఆర్ధికమంత్రి ప్రకటక ఉందన్నారు రుద్రరాజు. గత పాలనలో జరిగిన కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని, సీబీఐ ,ఈడీ తో దర్యాప్తు జరగాలన్నారు. జగన్ అసెంబ్లీ కి వెల్లకపోవడం ఆయన వ్యక్తిగతమని, జగన్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఏపీలో జరిగిన హత్యలు,దాడుల పై విచారణ జరగాలని, ఏపీలో వరద పరిస్థితులను సమీక్ష జరిపెందుకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపించి నష్టం పై అంచనా వేయాలన్నారు రుద్రరాజు.

Papua New Guinea: 26 మంది దారుణ హత్య.. నదిలోకి మృతదేహాలను ఈడ్చుకెళ్లిన మొసళ్లు..