చిత్తురు జిల్లాలో సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమొక్ర్సీ, సేవ్ నేషన్ పేరిట కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. గాంధీ రోడ్దు దగ్గర బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి, తులసీ రెడ్డి, చింతా మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. రాజ్యంగంపై విశ్వాసం లేని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తున్నది అని ఆయన ఆరోపించారు. ఆంద్ర రాష్ట్రం ఇండియాలో భాగం కాదని బీజేపీ విశ్వసిస్తుంది.. అందుకే పార్లమెంటులో పాసైన చట్టాలను అమలు పరచడం లేదు.. తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ లు ఫెయిల్ అయ్యారు అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Read Also: Virat Kohli Tickets: ముందే చెబుతున్నా.. ప్రపంచకప్ 2023 టికెట్స్ ఎవరూ అడగొద్దు: కోహ్లీ
బెయిల్ లో ఉన్న ముఖ్యమంత్రి, జైల్ లో ఉండి బెయిల్ కోసం ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నాయకుడు ఇదీ ఆంధ్రప్రదేశ్ దుస్ధితి అని గిడుగు రుద్రరాజు తెలిపారు. సీఎం జగన్ తో అదానీ చర్చల అంశాలను బహిర్గతం చేయాలి.. ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది.. భవిష్యత్తులో ఇండియా కూటమిలో చేరబోయే పార్టీలను బట్టి పొత్తులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. అవసరమైనప్పుడు క్రీయాశీల రాజీకాయాల్లో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు అని రుద్రరాజు పేర్కొన్నారు.
Read Also: Caste Census: బీజేపీ సవాల్ గా మారిన కుల గణన.. 2024లో తలనొప్పిగా మారే ఛాన్స్..?
రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. విభజన హామీలు ఒక్కటీ కూడా అమలు కాలేదు అని ఆయన పేర్కొన్నారు. అయినా గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం ఈ అంశానికి తర్పణం వదిలారు.. ఈ ప్రభుత్వం బ్రాందీ షాపులు నుంచి కలెక్టర్ ఆఫీస్ లపై కూడా అప్పు చేసింది.. వైఎస్ షర్మిళ కాంగ్రెస్ లోకి ఎంట్రీపై తనకు ఎటువంటి సమాచరం లేదు అని రాఘువీరారెడ్డి వెల్లడించారు.