NTV Telugu Site icon

MLA Anna Rambabu: ఆ మాటకే కట్టుబడి ఉన్నా.. ఈ సారి పోటీ నుంచి తప్పుకుంటున్నా..

Anna Rambabu

Anna Rambabu

MLA Anna Rambabu: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ కనిపిస్తోంది.. అయితే, కొందరు ఎమ్మెల్యేలకు సీటు కూడా దక్కకుండా పోతోంది.. మంత్రులు సహా పలువురు నేతలు సీట్లు మారుతున్నాయి.. ఈ తరుణంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి భారీగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు.. అయితే, రానున్న ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. మరోవైపు, పలువురు పార్టీ నియోజకవర్గ నేతలు తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంటపై తీవ్ర విమర్శలు చేశారు అన్నా రాంబాబు..

Read Also: MS Dhoni: ఎంతో కష్టంగా ఉన్నా.. నా అభిమానుల కోసమే ఇదంతా: ధోనీ

అయితే, ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు సంఘీభావం తెలిపారు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నేతలు.. ఎమ్మెల్యే అన్నాకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.. పదిహేనేళ్లుగా నా వెన్నంటే ఉన్న కార్యకర్తలకు ఆయన ధన్యావాదాలు తెలిపారు.. నిన్న చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అన్నారు. మరోసారి అన్ని విషయాలు మాట్లాడుతా.. ఇప్పటికి నో కామెంట్స్ అన్నారు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. కాగా, బుధవారం మార్కాపురంలోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడిన అన్నా రాంబాబు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించారు. తన ఆరోగ్య కారణాల వల్ల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వైసీపీలోనే కొనసాగుతానని, తాను పార్టీ మారుతున్నానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు.. కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రాంబాబు మండిపడిన విషయం విదితమే.