Site icon NTV Telugu

GHMC: నేటి నుండి జిహెచ్ఎంసిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ..

Ghmc

Ghmc

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ నేటి నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ వరకు తమ నామినేషన్ పత్రాలు జిహెచ్ఎంసి కార్యదర్శి కార్యాలయంలో సమర్పించవచ్చు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, తమ నామినేషన్ పత్రాలను మరో ఇద్దరు కార్పొరేటర్ల మద్దతుతో సమర్పించాలి. నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది.

Read Also: Rohit Sharma: రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కినెట్టి.. గేల్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్!

నామినేషన్ల పరిశీలనను ఫిబ్రవరి 18న నిర్వహించనున్నారు. ఆ రోజు నామినేషన్ల తుది జాబితాను జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఎన్నికలు జరిగితే, 15 స్థానాలున్న స్టాండింగ్ కమిటీకి అత్యధిక మెజార్టీ సాధించిన 15 మంది సభ్యులు ఎంపిక అవుతారు. గత పదేళ్లుగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయి. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో ఈసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి, ఇతర పార్టీ కార్పొరేటర్ల మద్దతు కోసం అభ్యర్థులు లాబీయింగ్ చేపట్టే అవకాశం ఉంది.

Read Also: Valentines Day Sale 2025: నథింగ్ ఫోన్స్ పై వాలెంటైన్స్ డే సందర్భంగా భారీగా డిస్కౌంట్

ఎన్నిక జరిగితే, అత్యధిక మెజార్టీ పొందిన 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎంపికవుతారు. ఈ కమిటీకి చైర్మన్‌గా మేయర్ కొనసాగుతారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగితే, నగర పాలనపై కీలకమైన ఈ కమిటీ నిర్మాణం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించనుంది. అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించి, విజయం సాధించేందుకు కసరత్తు చేయనున్నాయి.

Exit mobile version