GHMC Meeting: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నేడు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టనున్నారు. వార్డుల విభజన విధానం, దానిపై వచ్చిన అభ్యంతరాలు ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా నిలవనున్నాయి. వార్డుల పునర్విభజనపై నగర కార్పొరేటర్లు తమ అభ్యంతరాలు, సూచనలను సభలో స్పష్టంగా తెలియజేయనున్నారు. ఏ ప్రాతిపదికన వార్డుల విభజన చేపట్టారో తెలియట్లేదని, బౌండరీస్‌కు సంబంధించిన స్పష్టమైన మ్యాప్ అందించలేదని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
IPL 2026: నేడు తేలనున్న ఆటగాళ్ల భవితవ్యం.. వేలంపాటకు సర్వం సిద్ధం..!
ముఖ్యంగా కొన్ని వార్డుల్లో జనాభా అధికంగా ఉండగా, మరికొన్ని వార్డుల్లో తక్కువగా ఉండటంపై కూడా నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ సమావేశంలో ఎక్స్‌ఆఫీషియో హోదాలో జీహెచ్ఎంసి పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నేతలు వార్డుల విభజనపై తమ అభ్యంతరాలను జీహెచ్ఎంసి కమిషనర్‌కు వినతి పత్రాల రూపంలో అందజేశారు. కార్పొరేటర్లు, ఎక్స్‌ఆఫీషియో సభ్యులు వ్యక్తం చేసే అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వార్డుల డీలిమిటేషన్‌పై తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కీలకంగా మారింది.
Mother Sells Own Son: సొంత కొడుకునే అమ్మేసిన కసాయి తల్లి.. తండ్రి ఆవేదన..!
