Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన ఓ కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అద్భుతం చేశాడు. అతడు వీవీఐపీ అతిథులకు టీ, స్నాక్స్ కోసం రూ.20 లక్షలు వెచ్చించాడు. ఈ ఖర్చు 15 నెలల్లో జరిగింది. అంటే ప్రతినెలా దాదాపు రూ.1లక్ష 34వేలు ఖర్చయ్యాయి. ఈ మొత్తం వ్యవహారం డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన డబ్బును స్వాహా చేయడానికే జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైద్‌పూర్ తహసీల్‌లో విధులు నిర్వహిస్తున్న గుమస్తా టీ, స్నాక్స్ పేరుతో శాఖకు చెందిన రూ.20 లక్షలు వృథా చేశాడు. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు తహసీల్దార్ అవినీతికి పాల్పడిన గుమస్తాతో సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.
జిల్లాలోని సైద్‌పూర్ తహసీల్‌కు వీఐపీ అతిథి వచ్చినప్పుడల్లా, గుమస్తా సమీపంలోని ఇద్దరు దుకాణదారుల నుండి టీ తీసుకుని వచ్చేవాడు. డబ్బులు ఇచ్చే సమయానికి గుమస్తా దుకాణదారులకు రూ.20 నుంచి 50 వేల చెక్కు ఇచ్చేవాడు. టీ అమ్మకందారులు ప్రభుత్వ చెక్కును వారి ఖాతాలో చెల్లించిన తర్వాత వారి డబ్బు వారు తీసుకుని… మిగిలిన డబ్బును గుమాస్తాకు ఇచ్చేవాడు. ఇప్పటి వరకు 15 నెలల్లో పలు దఫాలుగా రూ.20 లక్షలకు పైగా స్వాహా చేశాడు.
Read Also:Tollywood: తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
గతంలో ఆయన పై అవినీతి కేసులో అరెస్టై జైలు పాలయ్యాడు. కొన్నాళ్ల తర్వాత విడుదలై తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత షకీల్ సేవారాయ్ తహసీల్‌కు ట్రాన్స్ ఫర్ అయ్యాడు. గురువారం మరోసారి ఆయన అక్రమాల కేసు వెలుగు చూసింది. ఘాజీపూర్ జిల్లా మేజిస్ట్రేట్ 2 రోజుల క్రితం తహసీల్‌ను తనిఖీ చేయడానికి వచ్చారు. ఆయన నజరేత్‌లోని ఒక ఖాతాలో కొన్ని అవకతవకలను చూశాడు. ఈ ఖాతా బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
దీనిపై విచారణ జరపాల్సిందిగా జిల్లా మేజిస్ట్రేట్ సైద్‌పూర్ ఎస్‌డిఎంను ఆదేశించారు. అనంతరం సైద్‌పూర్ ఎస్‌డీఎం తహసీల్దార్ దేవేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బృందంగా ఏర్పడి విచారణకు ఆదేశించారు. ఈ బృందం సైద్‌పూర్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడాకు చేరుకోగా, నజరత్ ఇచ్చిన చెక్కును పీడబ్ల్యూడీ గెస్ట్ హౌస్ సమీపంలోని ఇద్దరు టీ దుకాణదారుల ఖాతాల్లోకి చెల్లించినట్లు గుర్తించారు. విచారణ బృందం దుకాణదారులతో మాట్లాడగా, వారు తమ దుకాణం నుండి టీ మొదలైనవి సరఫరా చేసేవారని చెప్పారు. ప్రతిఫలంగా షకీల్ బాబు నుంచి ఎప్పటికప్పుడు చెక్కులు అందుకున్నారు. ఆ చెక్కులను తన ఖాతా ద్వారా చెల్లించేవాడు. తన వద్ద ఉన్న డబ్బును తీసివేసి, షకీల్ బాబుకు మిగిలింగి ఇచ్చేవాడు. టీ విక్రయదారులపై కూడా కేసు నమోదు చేశారు. వారిని విచారిస్తున్నారు.
Read Also:Viral Fever: తెలంగాణలో విజృంభిస్తున్న వైరల్ ఫీవర్.. ఆసుపత్రులన్నీ కిటకిట